హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వామివారి సేవలో మంత్రి కొల్లు రవీంద్ర

కృష్ణా: అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారిని శ్రావణ శుక్రవారం సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. రాష్ట్ర ప్రజలందరిపై స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా ఆశీర్వదించాలని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.