WG: నరసాపురం ప్రసిద్ధ శ్రీ అమరేశ్వరస్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి దేవి అమ్మవారిని రంగురంగుల గాజులతో నయనమనోహరంగా అలంకరించారు. ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
గాజుల అలంకారంలో భువనేశ్వరి దేవి


