హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెల్ ఫోన్ సర్వీసింగ్ ఉచిత శిక్షణ

SKLM: ఎచ్చెర్లలో ఉన్న యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నిరుద్యోగ యువకుల కోసం సెల్ ఫోన్ సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రామ్ జీ శుక్రవారం తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు ఉంటాయన్నారు.