హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీచర్‌ పోస్టులకు నేడే చివరి గడువు

ఉమ్మడి కడప జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కడప జిల్లాలో 360, అన్నమయ్య జిల్లాలో 164 పోస్టులు ఉన్నాయి. ఎస్‌జీటీకి రూ.10 వేలు, ఎస్‌ఏకు రూ.12,500 వేతనం చెల్లించనున్నారు. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 21 సాయంత్రంలోపు సంబంధిత ఎంఈవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.