హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హంద్రీనీవాకు రూ.750 కోట్ల కేటాయింపు

ATP: హంద్రీనీవా ప్రధాన కాలువ ఆధునికీకరణ పనులకు మరో రూ.750 కోట్లు మంజూరయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లా కదిరి, ధర్మవరం నియోజకవర్గాల్లో మిగిలిన పనులు పూర్తి చేయనున్నారు. ఆ మేరకు రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ జీవో నంబరు 478ని జారీ చేశారు. 400.500 నుంచి 490 కి.మీ. వరకు ఆధునికీకరణ, అప్రోచ్‌ కాలువ పనులు చేపట్టనున్నారు. త్వరలో టెండర్లు పిలవనున్నారు.