NLR: అనంతసాగరంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా సురేంద్ర తన ద్విచక్ర వాహనాన్ని వారి కంటపడకుండా లోపలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అతని ఐదేళ్ల కుమారుడు అమాయకంగా ‘‘సార్.. మా నాన్న బండిని లోపల పెడుతున్నాడు. వచ్చి పట్టుకోండి’’ అంటూ పోలీసులకు చెప్పేశాడు. బాబు మాటలకు పోలీసులు, అక్కడున్న వారు నవ్వుకున్నారు. అనంతరం వాహనాన్ని తెప్పించి పత్రాలు పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసులను ఆకట్టుకున్న బాలుడి నిజాయతీ


