హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్లలో 1.04 లక్షల మందికి నోటీసులు

బాపట్ల జిల్లాలో ఓటర్ల సవరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. నో మ్యాపింగ్, అనామలీస్ జాబితాలోని 1,59,116 మంది ఓటర్లలో ఇప్పటి వరకు 1,04,824 మందికి నోటీసులు ఇచ్చినట్లు కలెక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. గురువారం సీఈఓ వివేక్ యాదవ్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రోజుకు 5 వేల మందికి నోటీసులు ఇస్తున్నామని, మిగిలిన 54,292 మందికి ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.