హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శునకాల బెడదతో ప్రజల బెంబేలు

సత్యసాయి: మామిళ్లపల్లి, కనగానపల్లి, తగరకుంట, మద్దెలచెర్వు, తూంచెర్ల, దాదలూరు గ్రామాల్లో వీధికుక్కలు గుంపులుగా సంచరించి గ్రామస్థులను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రతి రోజూ ఇవి పాదచారులు, చోదకులపై దాడిచేసి గాయపరుస్తున్నాయి. దీంతో ఈ మార్గంలో వెళ్లాలంటే పాదచారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.