హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమలాపురంలో లోక్ అదాలత్

కోనసీమ: మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో అమలాపురం కోర్టు భవనాలలో సెప్టెంబర్ 12వ తేదీన లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు రెండో అదనపు కోర్టు జిల్లా న్యాయమూర్తి చంద్రమౌళీశ్వరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న సివిల్, బ్యాంక్, చెక్ బౌన్స్ కేసులతో పాటు, రాజీపడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు.