PPM: కొమరాడ మండలంలో శుక్రవారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు పంట పొలాల్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించాయి. పామాయిల్, పత్తి, బీర, చిక్కుడు, అరటితోటలతో పాటు వరి పొలాన్ని ధ్వంసం చేశాయి. అలాగే విద్యుత్ పంపు మోటారును కూడా పాడు చేశాయి. నష్టపోయిన రైతులను అధికారులు వెంటనే పరిశీలించి తగిన పరిహారం అందించాలని సీపీఎం నాయకుడు కొల్లి సాంబమూర్తి కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఏనుగుల దాడిలో పంటలకు నష్టం


