హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తి శ్రద్ధలతో మంగళ గౌరీదేవికి పూజలు

KDP: సిద్దవటం మండలం మాధవరం-1లో వెలసిన శ్రీ మంగళ గౌరీ సమేత అమరలింగేశ్వరుని ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం మంగళ గౌరీ దేవికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు జింకా సాంబయ్య అమ్మవారికి జలాభిషేకం,కుంకుమార్చన, వంటిపలు అభిషేకాలను నిర్వహించి పూలతో అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.