హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వాడపల్లి ఆలయంలో సేవలు రద్దు

కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం నుంచి సోమవారం వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 22, 23, 24 తేదీల్లో అష్టోత్తర నామార్చన, కల్యాణం, ఉపనయనం, వివాహం తదితర ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ విషయాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన సూచించారు.