హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డుపై నీరు.. వాహనదారులకు తిప్పలు!

PPM: పాలకొండ ప్రధాన రహదారిలో ఆక్రమణల కారణంగా మురుగునీటి సమస్య తీవ్రంగా మారింది. ఆంజనేయ కూడలి వద్ద ఇరువైపులా కాలువలు ఆక్రమణకు గురవడంతో వర్షపు నీరు వెళ్లే మార్గం లేక రోడ్డుపైనే నిలిచిపోతోంది. దీంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వాహనాలు వెళ్లే సమయంలో నీరు వారిపై చిమ్ముతుండటంతో అవస్థలు అవస్థలు పడుతున్నామని  స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.