NTR: తిరువూరు మండలం చౌటపల్లి రహదారులు గుంతలమయమై ప్రమాదకరంగా మారాయి. పాఠశాల విద్యార్థులు, వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే ఆర్‌అండ్‌బీ అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుంతలమయమైన చౌటపల్లి రహదారులు


