హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువలు లేవు.. రోడ్డుపైనే మురుగు!

PPM: సాలూరు మండలం కందులపదం పంచాయతీ మడతనవలస గ్రామంలో మురుగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామంలో కాలువలు లేకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే వాడుక నీరు రహదారిపై నిలిచిపోతోంది. దీంతో దోమల బెడద పెరిగి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాకపోకలకు కూడా ఇబ్బందులు కలుగుతుందని వాపోయారు.