హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరలక్ష్మీ దేవి ప్రత్యేక అలంకరణ

ATP: తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ శుభ దినాన శ్రీ పార్వతీదేవి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ మాస రెండవ శుక్రవారం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు సమర్పించారు.