E.G: కడియపులంక గ్రామదేవత శ్రీ ముసలమ్మ అమ్మవారు శ్రావణ శుక్రవారం సందర్భంగా ధనలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామ ప్రజల సహకారంతో రూ. 50 లక్షల నూతన కరెన్సీ నోట్లతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. గత ఆరు సంవత్సరాలుగా వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారిని ధనలక్ష్మి దేవిగా అలంకరిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్
రూ. 50 లక్షలతో అమ్మవారి అలంకరణ


