హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాబ్స్ పేరుతో భారీ మోసం.. సౌజన్య అరెస్ట్

VSP: ఐరోపాలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడిన ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ నిర్వాహకురాలు సౌజన్యను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో 15 మంది బాధితులు రూ.70 లక్షలు నష్టపోయామని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పెనమలూరులో సౌజన్య ఇంటిని సోదాలు చేసి బంగారం, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.