NDL: బనగానపల్లె మండలం పలుకూరు ఎంపీపీ పాఠశాలలో శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం బాల్య వివాహాల నిర్మూలన, బాలిక విద్యపై సదస్సు నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు బ్రహ్మానంద చారి మాట్లాడుతూ సమిష్టి కృషితో బాల్య వివాహాలను అరికట్టాలని, బాలికల విద్యను ప్రోత్సహించాలని కోరారు. అనంతరం 80 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'సమిష్టి కృషితో బాల్య వివాహాల నిర్మూలన'


