KRNL: ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ ఆధ్వర్యంలో చైతన్య కళాశాల సమీపంలో గురువారం మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 20 ద్విచక్ర వాహనాలను గుర్తించి జరిమానాలు విధించారు. విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి రహదారి భద్రత, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాలపై సీఐ కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
కర్నూలులో మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక తనిఖీలు


