హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కల్లూరులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం

KRNL: కల్లూరు అర్బన్‌ 30వ వార్డు శరిన్‌నగర్‌, మాలగేరి వాటర్‌ ట్యాంక్‌ కాలనీల్లో గురువారం సాయంత్రం పాణ్యం టీడీపీ యువ నాయకుడు గౌరు జనార్దన్‌ రెడ్డి పర్యటించారు. ‘రెండేళ్ల నమ్మకం–సంక్షేమం–అభివృద్ధి’ కరపత్రాలు పంపిణీ చేసి, కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.