NTR: మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణను ప్రభుత్వం విరమించుకోవాలి CITU డిమాండ్ చేసింది. తిరువూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట CITU ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించి మాట్లాడారు. జీవో నెంబర్ 975, 673లను వెంటనే రద్దు చేయాలన్నారు. 14 రకాల పౌర సేవలను PPP పద్ధతిలో ప్రైవేటీకరణ జరిగితే ప్రజలపై భారం పడుతుందన్నారు. 48 వేల కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రైవేటుకరణను ప్రభుత్వం విరమించుకోవాలి'


