PLD: ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ చుక్క రత్నమన్మోహన్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ నజీర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. దోమల ద్వారా మలేరియా, ఇతర వ్యాధులు వ్యాప్తి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి ఒక్కరూ దోమతెరలు వినియోగించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ర్యాలీ


