హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దోమల నివారణపై అవగాహన కార్యక్రమం

ASR: ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా గురువారం పాడేరులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ నిశాంతి పాల్గొని దోమ తెరలను పంపిణీ చేశారు. దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత 2 నెలల్లో జిల్లాలో 43,500 దోమతెరలను పంపిణీ చేసినట్లు తెలిపారు.