హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కుల వివక్షపై సమరం సాగిద్దాం'

ప్రకాశం: కుల వివక్ష రూపాలపై సమర శంఖం పూరిద్దామని కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి బాలకోటయ్య పిలుపునిచ్చారు. కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గత రెండు నెలలుగా జరుగుతున్న 'సామాజిక శంఖారావం' బైక్ యాత్ర టంగుటూరులో ప్రారంభమై.. S.కొండ, కందుకూరు మీదుగా గురువారం కొండేపి (M), ఉప్పలపాడుకు చేరింది. బాలకోటయ్య మాట్లాడుతూ.. నేటికీ సమాజంలో కుల వివక్ష కొనసాగుతోందన్నారు.