హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పిల్లల కోసం హాస్టళ్లు పునరుద్ధరించాలి'

SKLM: వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల పిల్లల విద్య కోసం హిరమండలంలో ఎస్సీ, బీసీ హాస్టళ్లను తక్షణమే పునరుద్ధరించాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీలో ప్రస్తావిస్తూ, ప్రాజెక్టు కారణంగా 20 గ్రామాలు నష్టపోయాయని తెలిపారు. ముంపులో హాస్టళ్లు మూతపడటంతో పిల్లల చదువులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.