హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ సర్వసభ్య సమావేశం వాయిదా..!

ప్రకాశం: కొండేపి మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం 11:00 గంటలకు జరగాల్సిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. మధ్యాహ్నం 2:30 గంటల వరకు కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే హాజరు కావడంతో సమావేశానికి అవసరమైన కనీస సభ్యుల సంఖ్య (క్వారం) లేనందున సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీపీ కే. స్వప్న కుమారి ప్రకటించారు.