హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బొత్సను దూషించడం ప్రజాస్వామ్యానికే అవమానం'

SKLM: శాసనమండలిలో వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణను మంత్రి అచ్చెన్నాయుడు దూషించడంపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. సీనియర్ నేతను అసభ్యంగా మాట్లాడటం సంస్కారహీనతకు నిదర్శనమన్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. అచ్చెన్నాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.