హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పరిసరాల పరిశుభ్రతతో దోమల నివారణ'

KDP: ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా సిద్ధవటం‌లోని టక్కోలు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు దోమల నివారణపై అవగాహన కల్పించారు. డాక్టర్ రంగలక్ష్మి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని మలేరియా సబ్‌యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.