హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దువ్వలో యాక్సిడెంట్'

WG: తణుకు మండలం దువ్వ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పాదచారి గాయపడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపోలవరం గ్రామానికి చెందిన సత్తిబాబు ద్వారకా తిరుమల దేవాలయానికి నడిచి వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన సత్తిబాబును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.