హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డయాలసిస్‌ సెంటర్‌ కోసం ఎమ్మెల్యే వినతి

TPT: సూళ్లూరుపేట నియోజకవర్గంలో కిడ్నీ డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విజయశ్రీ సీఎం చంద్రబాబు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ను కోరారు. నియోజకవర్గంలోని 185 మంది కిడ్నీ రోగులు డయాలసిస్‌ కోసం నెల్లూరు, తిరుపతి, చెన్నైలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.