హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: అదనపు ఎస్పీ

సత్యసాయి: ప్రశాంతి నిలయం మందిరంలో సైబర్ నేరాలపై జిల్లా పోలీస్ శాఖ అవగాహన సదస్సు నిర్వహించింది. జిల్లా అదనపు ఎస్పీ అంకిత సురానా హాజరై డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్, జాబ్ ఫ్రాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోసపోతే 'గోల్డెన్ అవర్'లో స్పందించి 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా జాతీయ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని పుట్టపర్తి డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు.