KDP: అహోబిలం రిజర్వ్ ఫారెస్ట్‌లో దారి తప్పిన ఆరుగురు భక్తులను పోలీసులు, అటవీశాఖ సిబ్బంది, ఆలయ సిబ్బంది సంయుక్తంగా గాలించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రొద్దుటూరు, అనంతపురం, నంద్యాల ప్రాంతాలకు చెందిన భక్తులు పావన నృసింహస్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా దారి తప్పారు. ఆళ్లగడ్డ రూరల్ ఎస్‌ఐ వరప్రసాద్ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
'తప్పిపోయిన ఆరుగురు సురక్షితం'


