హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతుల పక్షాన వైసీపీ పోరాటం: మాజీ ఎమ్మెల్యే

KRNL: రైతుల పంటలను కాపాడేందుకు హంద్రీనీవా కాలువ ద్వారా సాగునీరు అందించాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డిమాండ్ చేశారు. గురువారం రైతులతో కలిసి హంద్రీనీవా కాలువ వెంట పర్యటించిన ఆమె.. కాలువ నీటిని వినియోగిస్తున్న రైతుల విద్యుత్ మోటార్ల వైర్లు తొలగించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.