హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బ్రేక్‌ఫాస్ట్.. జొన్న ఇడ్లీ ట్రై చేశారా?

జొన్నల్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఉదయాన్నే జొన్న ఇడ్లీ తింటే కడుపు ఎక్కువ సేపు నిండినట్లుగా అనిపిస్తుంది. పదే పదే ఆకలి వేయకపోవడంతో పాటు అనవసరమైన కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. శరీర బరువు అదుపులోకి వస్తుంది. జొన్నల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్ ఖనిజాలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె సంబంధిత జబ్బులు రాకుండా కాపాడుతాయి.