హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

చక్రాసనం వల్ల కలిగే ఉపయోగాలు

చక్రాసనం (వీల్ పోజ్) వేయడం వల్ల వెన్నుపామును బలంగా, సాగేలా చేస్తుంది. ఛాతీ భాగం వికసించి ఆక్సిజన్ అందజేస్తుంది. ఉదర భాగంలోని కొవ్వును తగ్గించి, కండరాలను టోన్ చేస్తుంది. శరీరానికి నూతనోత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. మెదడుకు రక్త ప్రసరణ అందించి, ఒత్తిడిని దూరం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి మానసిక ప్రశాంతతను ఇస్తుంది.