SRD: సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు ఎస్పీ పరితోష్ పంకజ్‌ను కలిసి ఫిర్యాదులు అందజేశారు. వినతులపై తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ప్రజావాణిని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
తెలంగాణ
ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోండి: ఎస్పీ


