హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫ్యాక్టరీ కాలుష్యంపై కలెక్టర్‌కు ఫిర్యాదు'

SRPT: సూర్యాపేట మండలం జాటోత్‌ తండాలో కెమికల్స్‌ పరిశ్రమ కాలుష్యంపై సర్పంచ్‌ జాటోత్‌ నాగేష్‌ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న విషవాయువులు, వ్యర్థాలతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆరోపించారు. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా పరిశ్రమను నివాస ప్రాంతానికి దూరంగా తరలించాలని కోరారు.