SDPT: వర్గల్ మండలం గుంటిపల్లికి చెందిన బొడిగె వీరాగౌడ్ (38) అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ఈనెల 16న ఇంట్లోంచి వెళ్లిన ఆయన, 17న వర్గల్లోని తన షాప్‌లోనే మృతదేహంగా కనిపించారని గౌరారం పోలీసులు తెలిపారు. మృతికి ముందు వాంతులు చేసుకున్న ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. భార్య మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
తెలంగాణ
వ్యాపారి అనుమానాస్పద మృతి


