హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారికి పేరు పెట్టిన కేఎంసీ కమిషనర్.!

KMM: గుండె జబ్బుతో బాధపడుతున్న ఖమ్మం చిన్నారికి కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య అండగా నిలిచారు. ప్రభుత్వ సహకారంతో రూ.14 లక్షల ఆర్థిక సాయం అందించి పాపకు గుండె ఆపరేషన్ చేయించారు. శస్త్రచికిత్స తర్వాత చిన్నారి పూర్తిగా కోలుకోవడంతో, తల్లిదండ్రులు కమిషనర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆ చిన్నారికి కమిషనర్ 'జస్విక శ్రీ' అని నామకరణం చేశారు.