హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యలను వెంటనే పరిష్కరించాలి: బీఎంఎస్

MBNR: మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తాలో బీఎంఎస్ ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు నిరసన తెలిపారు. బీఎంఎస్ జిల్లా కన్వీనర్ చిలుక రాఘవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాన్ని రూ.30 వేలకు పెంచాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.