MBNR: జడ్చర్ల పట్టణంలో సోమవారం మధ్యాహ్నం చైన్ స్నాచింగ్ జరిగింది. వెంకటేశ్వరస్వామి ఆలయం ఎదుట టీ స్టాల్ నిర్వహిస్తున్న ఉదయకళ వద్దకు ఇద్దరు వ్యక్తులు యమహా ఆర్15 బైక్‌పై వచ్చి టీ తాగుతున్నట్లు నటించారు. అనంతరం మహిళ మెడలోని సుమారు మూడు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించి పరారయ్యారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
జడ్చర్లలో చైన్ స్నాచింగ్


