MDK: రామాయంపేట మండల కేంద్రంలో సోమవారం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు హఠాత్తుగా కురిసిన వర్షం ఉపశమనాన్నిచ్చింది. ఈదురు గాలులతో వాన పడటంతో వాతావరణం చల్లబడింది. అయితే, ఆకస్మిక వర్షం వల్ల రహదారులపై నీరు చేరి వాహనదారులు, బాటసారులు కొంత ఇబ్బంది పడ్డారు.
తెలంగాణ
VIDEO: ఈదురు గాలులతో వర్షం


