హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్యాంకులో మేనేజర్ లేక ఇబ్బందులు

NRPT: నర్వ మండల కేంద్రంలోని టీజీబీ బ్యాంకులో మేనేజర్ లేకపోవడంతో రైతులు రుణాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 20 రోజుల క్రితం మేనేజర్ HYD హెడ్‌ఆఫీస్‌కు బదిలీ అయినా, ఇంతవరకు ఇంఛార్జ్ మేనేజర్‌ను నియమించలేదు. 20 వేలకుపైగా ఖాతాలు ఉన్న బ్యాంకులో క్రాప్ లోన్లు, ముద్ర లోన్లు, ఇతర లావాదేవీలు సకాలంలో జరగడం లేదని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.