ASF: పెంచికల్ పేట్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల PDS బియ్యాన్ని సోమవారం అధికారులు పట్టుకున్నారు. దహేగాం మండలంలోని పలు గ్రామాల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని ఓ వాహనంలో తరలిస్తుండగా పెంచికల్ పేట్ వద్ద పట్టుకున్నారు. డీటీ రాజ్ కుమార్, ఎస్సై అనిల్ కుమార్ తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు.
తెలంగాణ
30 క్వింటాళ్ల అక్రమ PDS బియ్యం పట్టివేత


