NRML: లోకేశ్వరం మండలంలోని రాజుర గ్రామంలో శ్రీ రామాలయ పునర్నిర్మాణ పనులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శంకుస్థాపన చేశారు. దేవాదాయ శాఖ CGF నిధులు రూ.40 లక్షలతో పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
రామాలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన


