హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమించాలి'

ADB: తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు హైదరాబాదులోని కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని తాజా రాజకీయాలను ఆమెతో చర్చించినట్లు పేర్కొన్నారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమించాలని ఆమె సూచించినట్లు బాపూరావు తెలియజేశారు.