KNR: కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సోమవారం పాడిరైతులు భారీ ఆందోళన చేపట్టారు. తెలంగాణ చౌరస్తా నుంచి ర్యాలీగా వచ్చిన రైతులు ఫ్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. భూభారతిలో సంస్థ ఆస్తుల మార్పుపై నిరసన చేపట్టామని తెలిపారు. పాడిరైతులకు ప్రోత్సాహకాలు కొనసాగించాలని అన్నారు.
తెలంగాణ
VIDEO: పాడిరైతుల భారీ ఆందోళన


