హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వరంగల్‌లో జోరుగా వర్షం

WGL: నగర వ్యాప్తంగా వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి వాతావరణం పొడిగా ఉండగా, కొద్దిసేపటి క్రితం ఒక్కసారిగా మారింది. ఈ క్రమంలో జోరుగా వర్షం కురుస్తున్నది. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలలోకి నీరు చేరుతున్నది. గత రెండు రోజులుగా ఎండ వేడిమితో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఈ వర్షంతో కాస్త ఊరట లభించినట్లు అయింది. మరోవైపు పంటలు వేయడానికి సిద్ధం అవుతున్న రైతులకు ఈ వర్షం ఊరటనిస్తుంది.