హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్యాణలక్ష్మిపై మాజీ ఎమ్మెల్యే ఫైర్

VKB: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి ఆరోపించారు. తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, ఉన్న పథకాన్ని ఎత్తివేస్తున్నారని విమర్శించారు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించి నిధులు విడుదల చేయాలని పరిగి బస్టాండ్ వద్ద నిర్వహించిన నిరసనలో డిమాండ్ చేశారు.